CM JAGAN ATTEND THE MARRIAGE : ముఖ్యమంత్రి జగన్.. తన వ్యక్తిగత కార్యదర్శి రవిశేఖర్ కుమార్తె వివాహానికి హాజరయ్యారు. రాత్రి ఇడుపులపాయలో బసచేసిన జగన్.. ఉదయం అక్కడి నుంచి హెలికాప్టర్లో పులివెందుల చేరుకున్నారు. సీఎంతో పాటు ఆయన భార్య భారతి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కొందరు అందజేసిన వినతి పత్రాలు స్వీకరించారు. అక్కడి నుంచి కడప విమానాశ్రయం చేరుకున్న జగన్.. ప్రత్యేక విమానంలో గన్నవరానికి బయలుదేరారు.
ఇవీ చదవండి: