ముఖ్యమంత్రి జగన్ ఇవాళ, రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు. జగన్ మామ, భారతి తండ్రి గంగిరెడ్డి ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం ఇవాళ జిల్లాకు రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం నుంచి విమానంలో బయలుదేరి కడపకు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు కడప విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో ఇడుపులపాయ వెళ్తారు. రాత్రికి ఇడుపులపాయలోనే సీఎం బస చేయనున్నారు. 3వ తేదీ ఉదయం 9 గంటలకు ఇడుపులపాయ నుంచి పులివెందులకు వెళ్తారు.
భాకరాపురం సమీపంలోని గంగిరెడ్డి సమాధి వద్ద నివాళులర్పించనున్నారు. అక్కడే గంగిరెడ్డి విగ్రహావిష్కరణ చేస్తారు. అనంతరం భాకరాపురంలోని ఆడిటోరియంలో గంగిరెడ్డి ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో కుటుంబసభ్యులతో కలిసి పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు పులివెందుల నుంచి హెలికాప్టర్‌లో కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారని అధికార వర్గాలు వెల్లడించాయి. బద్వేలు ఉప ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సీఎం పర్యటనలో ఎలాంటి ప్రసంగాలు ఉండకపోవచ్చని సమాచారం.
కడప జిల్లాలో సీఎం పర్యటన సందర్భంగా... కలెక్టర్ విజయరామరాజు, ఎస్పీ అన్బురాజన్... బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్యవేక్షించాలని పోలీసులను ఆదేశించారు.
ఇదీ చదవండి: