కడప జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు బయలు దేరిన చంద్రబాబు 11: 30 నిమిషాలకు కడప విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన రాజంపేట మండలం తోగూరుపేట గ్రామాన్ని చేరుకుని బాధితులను పరామర్శిస్తారు. అనంతరం 12 గంటలకు మందపల్లె, 12.25కు పులపుత్తూరు, 12.45కు గుండ్లూరు గ్రామాల్లో పర్యటించనున్నారు.
చిత్తూరు జిల్లాలో పర్యటన
రేపు ఉదయం చిత్తూరు జిల్లాలోని రేణిగుంట రహదారిలో ముంపునకు గురైన ఆటోనగర్ ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. అనంతరం లక్ష్మీపురం కూడలి, ఎమ్‌ఆర్‌పల్లె, శ్రీకృష్ణానగర్, సరస్వతినగర్, గాయత్రినగర్, దుర్గానగర్ ప్రాంతాల్లో వరదప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. ముంపు బాధితులతో చంద్రబాబు మాట్లాడనున్నారు. తిరుచానూరు సమీపంలో కోతకు గురైన స్వర్ణముఖి నదిపై నిర్మించిన వంతెనను పరిశీలించనున్నారు. గురువారం నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారు.
ఇదీ చదవండి
rains in kadapa: గుండె చెరువాయె.. బతుకు బరువాయె.. ముంపు గ్రామాలను వీడని వరద భయం!