మాజీమంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకేసు ఛేదించడానికి రంగంలోకి దిగిన సీబీఐ విచారణ ముమ్మరం చేసింది. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పులివెందులలోని వివేకా ఇంట్లో సీబీఐ అధికారులు సీన్ రీ కనస్ట్రక్షన్ చేశారు. హత్య జరిగిన రోజు ఏం జరిగి ఉంటుందన్న దానిపై సునిశిత పరిశీలన చేస్తున్నారు. కాగా ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న వాచ్‌మెన్ రంగన్నను ఘటనాస్థలికి తీసుకెళ్లి అధికారులు విచారించారు. అలాగే వివేకా పీఏ కృష్ణారెడ్డి, డ్రైవర్ ప్రసాద్, వంటమనిషి కుమారుడు ప్రకాశ్‌ను సీబీఐ విచారించింది. శనివారం నుంచి దర్యాప్తు మరింత వేగవంతం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
వివేకా హత్య కేసు: సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసిన సీబీఐ అధికారులు - కడప జిల్లా తాజా వార్తలు
వైఎస్ వివేకా హత్యకేసు దర్యాప్తును సీబీఐ ముమ్మరం చేసింది. దిల్లీ, తమిళనాడు నుంచి ప్రత్యేక బృందంగా వచ్చిన సీబీఐ అధికారులు కడపలోనే మకాం వేశారు. కడప నుంచి పులివెందులకు రోజూ వెళ్తూ విచారణ జరుపుతున్నారు.
మాజీమంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకేసు ఛేదించడానికి రంగంలోకి దిగిన సీబీఐ విచారణ ముమ్మరం చేసింది. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పులివెందులలోని వివేకా ఇంట్లో సీబీఐ అధికారులు సీన్ రీ కనస్ట్రక్షన్ చేశారు. హత్య జరిగిన రోజు ఏం జరిగి ఉంటుందన్న దానిపై సునిశిత పరిశీలన చేస్తున్నారు. కాగా ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న వాచ్‌మెన్ రంగన్నను ఘటనాస్థలికి తీసుకెళ్లి అధికారులు విచారించారు. అలాగే వివేకా పీఏ కృష్ణారెడ్డి, డ్రైవర్ ప్రసాద్, వంటమనిషి కుమారుడు ప్రకాశ్‌ను సీబీఐ విచారించింది. శనివారం నుంచి దర్యాప్తు మరింత వేగవంతం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవీ చూడండి-గవర్నర్ ఆదేశాలిచ్చినా పోస్టింగ్ ఇవ్వకపోవటం దారుణం:సుప్రీం