సీఎం జగన్ చిన్నాన్న... మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో 56వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథిగృహంలో సీబీఐ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. అనంతపురం జిల్లా కదిరికి చెందిన లోకేష్, గోవర్ధన్ లను ఇవాళ సైతం ప్రశ్నించారు.
సుమారు రెండు గంటలపాటు విచారించిన వీరిద్దరి నుంచి పలు కీలక విషయాలను రాబట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకూ లభించిన సమాచారం ఆధారంగా... రేపటి నుంచి మరికొంత మంది అనుమానితులను సీబీఐ అధికారులు విచారించనున్నారు.
నిన్న ఆరుగురు...
నిన్న కూడా సీబీఐ అధికారులు విచారణను కొనసాగించారు. ఆరుగురు అనుమానితులను ప్రశ్నించారు. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలోనే విచారణ చేశారు. తుమ్మలపల్లి యురేనియం ఉద్యోగి ఉదయ్ కుమార్‌రెడ్డి.. అనంతపురం జిల్లాకు చెందిన లోకేశ్, గోవర్ధన్ విచారణకు హాజరయ్యారు. వీరితో పాటు అనంతపురంలో రాజు రోడ్డులోని మాచినేని గ్రాండ్ హోటల్ మేనేజర్ రాజును సీబీఐ అధికారులు ప్రశ్నించారు.
2018లో హోటల్‌కు వచ్చిన వ్యక్తుల వివరాలు అడిగిన సీబీఐ.. సునీల్ యాదవ్ హోటల్‌కు వెళ్లి ఉంటారనే సమాచారంతో మేనేజర్‌ను ఆరా తీశారు. ఈ కేసులో మరింత స్పష్టత తెచ్చే దిశగా కీలక సమాచారాన్ని రాబట్టేందుకు సీబీఐ అధికారులు ప్రయత్నిస్తున్నారు. 2019 మార్చి 15న వివేకా దారుణహత్యకు గురికాగా.. మార్చి 14 అర్ధరాత్రి పులివెందులలో అనుమానాస్పదంగా తిరిగిన పలు వాహనాల వివరాలను సేకరించి... ఆ దిశగా విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి:
CBN LETTER TO DGP: హత్య కేసులో సాక్షులకు బెదిరింపులు.. డీజీపీకి చంద్రబాబు లేఖ