కడప జిల్లా తొండూరు మండలం మల్లెల ఘాట్ సమీపంలో మంగళవారం రాత్రి కారుతో సహా ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. మృతుడు ప్రొద్దుటూరుకి చెందిన షేక్ నూర్ మహమ్మద్‌గా గుర్తించారు. కారు మెకానిక్‌గా పని చేసిన నూర్ మహమ్మద్... పులివెందులలో ఒక వాహనం మరమ్మతుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. అనుమానాస్పద మృతిగా.. ఎస్సై చంద్రశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఎన్నో అనుమానాలు
ప్రొద్దుటూరు - పులివెందుల మధ్య 66 కిలోమీటర్ల దూరం ఉండగా.. మహమ్మద్ అర్థరాత్రి వేళ బయలుదేరాల్సిన అవసరం లేదు. కారులోనే వ్యక్తి బూడిదయ్యేలా మంటలు వచ్చాయంటే.. కనీసం రెండు గంటలు పాటు కారు అగ్నికి ఆహుతి అయ్యి ఉండాలి. ఈ మార్గంలో నిత్యం లారీలు, బస్సులు రాకపోకలు ఉంటాయి. ఆ సమయంలో కారు కాలిపోవటం ఎవరూ చూడకపోవటం విచిత్రంగా ఉంది. కారులో ఉష్ణోగ్రత పెరిగితే.. హీటర్ సిగ్నల్ డ్రైవర్‌కు తెలుస్తుంది.. కానీ కారు దగ్ధమయ్యేంత ఉష్ణోగ్రత వచ్చినా, నూర్ మహమ్మద్‌కు తెలియలేదా.. అసలేం జరిగింది.. అన్నది పోలీసులు తేల్చే పనిలో ఉన్నారు.
ఇదీ చదవండి: