ETV Bharat / state

'ప్రజల సంరక్షణకు శ్రద్ధ వహించాలి'

author img

By

Published : Apr 18, 2020, 3:41 AM IST

కడప జిల్లా బద్వేల్​లో లాక్​డౌన్​ పరిస్థితులను ఎస్పీ అన్బురాజన్​ పరిశీలించారు. ప్రజల సంరక్షణకు శ్రద్ధ వహించి పనిచేయాలని పోలీసులకు సూచించారు.

cadapa sp anbhu rajan on lockdown
కడప లాక్​డౌన్​పై అన్బురాజన్​

లాక్ డౌన్ సమయంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్​ పోలీసులను ఆదేశించారు . బద్వేల్ పట్టణంలో పరిస్థితిని ఎస్పీ సమీక్షించారు. ఇది కీలకమైన సమయమని.. ప్రజల సంరక్షణకు శ్రద్ధ వహించి పనిచేయాలని సూచించారు. రెడ్​ జోన్​ ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రాకుండా చూడాలని ఆదేశించారు. వారికి అవసరమైన నిత్యావసర సరకులు కూరగాయలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్​లైనా గోపవరం మండలంలోని శ్రీనివాసపురం పీపీ కుంట చెక్ పోస్టులను సందర్శించి పోలీసులకు సూచనలిచ్చారు.

ఇదీ చదవండి: లాక్‌డౌన్‌ వల్ల రవాణ వ్యవస్థకు తీవ్ర ఆటంకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.