జగన్మోహన్ రెడ్డి సర్కార్ భవన నిర్మాణ కార్మికులకు ఇస్తానన్న పదివేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఇప్పటివరకు ఇవ్వకపోవటం దారుణమని కార్మిక సంఘాల నాయకులు ఖండించారు. తక్షణం లాక్ డౌన్ సమయంలో భవన నిర్మాణ కార్మికులకు ఇస్తానన్న పదివేల రూపాయలు మంజూరు చేయాలని కోరుతూ కడప రిమ్స్ లోని కార్మిక శాఖ కార్యాలయం ఎదుట ఏఐటీయూ, సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేశారు.
మూడు నెలల నుంచి ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి ఇప్పుడు పట్టించుకోకపోవటం దారుణమన్నారు. పేదల కడుపులు కొట్టటం సరైంది కాదని తెలిపారు. కార్మిక శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఆర్థిక సహాయం పట్ల వైకాపా సర్కార్ ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: