కడప జిల్లా బుగ్గవంక డ్యాం, కాలువను డీఎస్పీ సునీల్, సిస్టం ఏపీ ఇంఛార్జ్ మొయిన్ ఖాన్ ఆధ్వర్యంలో ఏరియల్ సర్వే చేశారు. నివర్ తుపాను ప్రభావంతో బుగ్గవంక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయని డీఎస్పీ తెలిపారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు ఏరియల్ సర్వే నిర్వహించామని చెప్పారు.
మాజీ సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో బుగ్గవంక ప్రొటక్షన్ వాల్ నిర్మించారని డీఎస్పీ అన్నారు. అయితే వాల్‌కు అక్కడక్కడా ఖాళీలు ఉన్నందున వరదల సమయంలో నీరంతా లోతట్టు ప్రాంతాల్లోకి వస్తోందని తెలిపారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఏరియల్ సర్వే చేశామని చెప్పారు. ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో వాటిని గుర్తించి, నివేదిక తయారుచేసి పై అధికారులకు పంపిస్తామని తెలిపారు.
ఇవీ చదవండి..