కడప జిల్లా మైదుకూరులో ఓ బాలుడికి ఊహించని ప్రమాదం ఎదురైంది. స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో కొంత మంది బాలురు క్రికెట్ ఆడుకుంటున్నారు. ఆ సమయంలో బంతి....రెండు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల మధ్య పడిపోయింది. దానిని తీసుకువచ్చేందుకు బాలుడు వాటి మధ్యకు వెళ్లాడు. బంతిని తీసుకునే ప్రయత్నంలో బాలుడు విద్యుదాఘాతానికి గురై..మంటలు చెలరేగాయి. వెంటనే ఫీజులు తొలగిపోవడంతో సరఫరా ఆగిపోయింది. గుర్తించిన స్థానికులు బాలుడిపై మట్టి చల్లి మంటలను ఆర్పివేశారు. తీవ్ర గాయాల పాలైన బాలుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
ఇదీచదవండి