విద్యుత్తు నియంత్రికల మధ్య పడిపోయిన క్రికెట్ బంతి కోసం వెళ్లి గాయపడిన సొహైల్ క్రమంగా కోలుకుంటున్నాడు. స్నేహితులతో కలసి క్రికెట్ ఆడుతున్న క్రమంలో శుక్రవారం ఈ ప్రమాదం జరిగింది.
కడప మైదుకూరు మండలంలోని చౌటపల్లెకు చెందిన అల్లాబకష్‌గారి బషీర్‌బాబా పాల వ్యాపారం చేస్తున్నారు. నెలరోజుల కిందటే వారు మైదుకూరుకు వచ్చారు. తోటి పిల్లలతో కలిసి సొహైల్ వ్యవసాయ శాఖ కార్యాలయ ఆవరణంలో క్రికెట్ ఆడుకుంటున్నాడు. బంతి పక్కనే ఉన్న విద్యుత్తు నియంత్రికల మధ్య పడింది. బంతిని తీసుకునే ప్రయత్నంలో షాక్‌కు గురై దిమ్మెపై కుప్పకూలిపోయాడు. అదే సమయంలో విద్యుత్తు సరఫరా ఆగిపోవడంతో.. స్థానికులు మట్టిని వెదజల్లి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. గోనె సంచితో బాలుడిని కిందకులాగారు. కడపలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బాలుడు క్షేమమేనని తెలిసి స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.
ఇదీ చదవండి: విద్యుదాఘాతంతో బాలుడికి తీవ్ర గాయాలు