కడప జిల్లా రాయచోటిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానాన్ని కాపాడాలని భాజపా నాయకులు జిల్లా కలెక్టర్ హరికిరణ్ను కోరారు. ప్రభుత్వం.. కళాశాల మైదానాన్ని ఇతరులకు కేటాయిస్తే ఊరుకునేది లేదని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యురాలు శాంతా రెడ్డి అన్నారు. ఎన్నో ఏళ్ల చరిత్ర గల కళాశాల మైదానాన్ని విద్యా సంస్థకే ఉంచాలని...ఇతరులకు కేటాయించడానికి ప్రభుత్వ భూమి చాలా ఉందని ఆమె తెలిపారు. కళాశాల మైదానం కోసం రేపటి నుంచి నిరాహార దీక్షలు చేస్తామని.. రాయచోటి ప్రజలంతా తమ వెంట ఉండాలని కోరారు. భవిష్యత్ తరాలకు అన్యాయం జరిగితే భాజపా పోరాడుతుందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: