ఓ చానల్ నిర్వహించిన డిబేట్ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిపై పక్కా పథకంతోనే దాడి చేశారని కడప జిల్లా భాజపా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ రెడ్డి ఆరోపించారు. అమరావతి ఐకాస కన్వీనర్ శ్రీనివాస రావుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా ఇలాంటి డిబేట్లు ఎన్నో జరిగాయని ఎంతోమంది ఆవేశంగా మాట్లాడారు.. కానీ ఇలాంటి ఘటన జరగటం హేయమైన చర్య అన్నారు. అలాంటి వారిని భవిష్యత్తులో ఎలాంటి డిబేట్లకు పిలవద్దన్నారు.
ఇదీ చదవండి