ETV Bharat / state

BJP: 'రాష్ట్రంలో నాయకుడు మద్యం అమ్ముతుంటే.. ఎమ్మెల్యేలు సారా కాస్తున్నారు' - సీఎం జగన్​పై భాజ‌పా జాతీయ కార్య‌ద‌ర్శి స‌త్య‌ కుమార్ కామెంట్స్​

BJP Leader Satya kumar: రాష్ట్రంలో నాయకుడు మద్యం అమ్ముతుంటే.. ఎమ్మెల్యేలు సారా కాస్తున్నారని భాజ‌పా జాతీయ కార్యద‌ర్శి స‌త్య కుమార్ ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజల్ని సీఎం జగన్​ మోసగించారని ఆయన ధ్వజమెత్తారు. క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరు వచ్చిన సత్య కుమార్‌ను.. భాజపా కార్యకర్తలు ఘనంగా సన్మానించారు.

bjp sathya kumar fire on cm jagan at proddatur

author img

By

Published : Mar 17, 2022, 5:09 PM IST

'రాష్ట్రంలో నాయకుడు మద్యం అమ్ముతుంటే.. ఎమ్మెల్యేలు సారా కాస్తున్నారు'

ఏపీలో ఒక్కఅడుగు ముందుకు.. ఐదు అడుగులు వెన‌క్కి అన్న చందాన పాల‌న సాగుతోంద‌ని భాజ‌పా జాతీయ కార్య‌ద‌ర్శి స‌త్య‌కుమార్ ఆరోపించారు. రాష్ట్రాన్ని జ‌గ‌న్ అంధ‌కారంలోకి నెట్టేస్తున్నార‌న్న స‌త్య‌కుమార్.. చెత్త‌తోపాటు అనేక ప‌న్నులు తీసుకొచ్చి ప్ర‌జ‌ల‌పై భారం వేస్తున్నారని మండిపడ్డారు. జ‌గ‌న్ ఎన్నికలముందు చేసిన వాగ్ధానాలు ఒక్క‌టి కూడా నెర‌వేర్చ‌లేదన్నారు. క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరు వచ్చిన సత్య కుమార్‌ను.. భాజపా కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. అంతకుముందు ప్రొద్దుటూరులో భాజపా అధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.

"రాష్ట్రంలో నాయకుడు మద్యం అమ్ముతుంటే.. ఎమ్మెల్యేలు సారా కాస్తున్నారు. ఉపాధ్యాయులు, యువ‌త‌ను జ‌గ‌న్ మోసం చేశార‌ు. క‌ల్తీ సారా తాగి ప్ర‌జ‌ల ప్రాణాలు పోతుంటే వైకాపా నేతలు వెటకారంగా మ‌ట్లాడ‌టం బాధాక‌ర‌ం. జ‌గ‌న్ సొంత జిల్లాలోనూ అభివృద్ది శూన్య‌ం. ఎంతో ప్రాధాన్య‌త ఉన్న క‌డ‌ప పేరు మార్చ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నించారు. ఇక‌నైనా జ‌గ‌న్‌.. తన వైఖ‌రి మార్చుకోవాలని హితవు పలికారు.

ఇదీ చదవండి: SEB Raids: నాటుసారా కట్టడిపై ఎస్‌ఈబీ దృష్టి... తయారీ కేంద్రాలపై దాడులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.