ETV Bharat / state

బైక్ దొంగ దొరికాడు.. 3 వాహనాలు స్వాధీనం

క‌డ‌ప జిల్లాలోని ప‌లు ప్రాంతాల్లో బైక్ దొంగ‌త‌నాల‌కు పాల్పడుతున్న ప్రొద్దుటూరుకు చెందిన దుర్గం దివాక‌ర్ అనే యువ‌కున్ని వ‌న్‌టౌన్ పోలీసులు అరెస్టు చేశారు.

బైక్ దొంగను అరెస్టు చేసిన పోలీసులు
author img

By

Published : Apr 29, 2019, 5:57 PM IST

కడప జిల్లా బైక్ లు దొంగ దొరికాడు

క‌డ‌ప జిల్లాలోని ప‌లు ప్రాంతాల్లో బైక్ దొంగ‌త‌నాల‌కు పాల్పడుతున్న ప్రొద్దుటూరుకు చెందిన దుర్గం దివాక‌ర్ అనే యువ‌కున్ని వ‌న్‌టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. గ‌తంలో కూడా అనేకసార్లు దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డిన దివాక‌ర్‌ను... ఓ బైక్ దొంగ‌త‌నం కేసులో పోలీసులు విచారించారు. తాజాగా జిల్లాలో మూడు బైక్‌ల‌ను దొంగ‌లించిన‌ట్లు అతను అంగీక‌రించిన‌ట్లు వ‌న్‌టౌన్ సీఐ రామ‌లింగ‌య్య తెలిపారు. రామేశ్వ‌రంలోని క‌డ‌ప టెక్నో స్కూల్ వ‌ద్ద ఉంచిన హోండా షైన్‌ చోరీ కేసు విచార‌ణలో భాగంగా.. దివాక‌ర్‌ను వ‌న్‌టౌన్ ఎస్ఐ ఖాన్‌ అరెస్టు చేసిన‌ట్లు తెలిపారు. దివాక‌ర్ నుంచి హోండా షైన్‌, టీవీఎస్ అపాచీ, రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్‌ ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున‌ట్లు సీఐ తెలిపారు. వీటి విలువ సుమారు మూడు ల‌క్ష‌లు ఉంటుంద‌ని ఆయన అంచ‌నావేశారు. ఈ ఆప‌రేష‌న్‌లో పాల్గొన్న ఇద్ద‌రు కానిస్టేబుళ్ళు మ‌హేష్‌, తిమ్మ‌రాయుడుల‌కు రివార్డులు అంద‌జేస్తున్న‌ట్లు సీఐ చెప్పారు.

ఇవి చూడండి...

దొంగతనాలకు పాల్పడుతున్న గజదొంగ అరెస్ట్​

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.