కడప జిల్లా వ్యాప్తంగా భారత్‌బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు స్వచ్ఛందంగా పాటిస్తున్నాయి.
కడప నగరం..
అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో కొనసాగుతున్న భారత్ బంద్ కడపలో ప్రశాంతంగా సాగుతోంది. బస్టాండ్ కూడలి వద్ద ఆ పార్టీ నేతలు.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. రోడ్లపై నడుస్తున్న ఆటోలు, కార్లను ఆందోళనకారులు అడ్డుకున్నారు. కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని విశాఖ ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. బంద్‌కు ప్రభుత్వమే మద్దతు ఇవ్వడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 8 డిపోల్లో పరిధిలో తొమ్మిది వందల బస్సు సర్వీసులు నిలిచిపోయాయి.
బద్వేలు..
ఈ ప్రాంతంలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎప్పుడు ప్రయాణికుల రద్దీ తో కనిపించే బద్వేల్ ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులు లేక వెలవెల పోయింది. బస్సులు డిపోకు పరిమితమయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి.
మైదుకూరు
వామపక్షాల నాయకులతోపాటు అనుబంధ సంఘాల ప్రతినిధులు భారత్ బంద్‌లో పాల్గొని పర్యవేక్షిస్తున్నారు. పట్టణంలోని నాలుగురోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడి వాహన రాకపోకలను అడ్డుకున్నారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలని డిమాండు చేస్తూ.. భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు
కడప..
సాగు చట్టాలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిలిపివేయకుండా.. ప్రాణత్యాగానికైనా చేస్తామని నియోజకవర్గ ఇన్చార్జ్ అమీర్ బాబు అన్నారు. భారత్ బందులో భాగంగా కడప కోటిరెడ్డి కూడలి వద్ద తెదేపా నాయకులు రోడ్డుపై బైఠాయించి అల్పాహారం సేవించారు. రైతుల కడుపు కొట్టే 3 నూతన చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని కోరారు. సెయిల్ ఆధ్వర్యంలో కడపలో ఉక్కు కర్మాగారం నిర్మించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండీ.. హైకోర్టు న్యాయమూర్తులకు కియా కార్లు