కడప జిల్లా రాజంపేట మండలం బోయినపల్లిలో వెలసిన భద్రావతి భావనారాయణస్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం నిరాడంబరంగా జరిగింది. స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించాల్సి ఉండగా కరోనా కారణంగా ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రావతి సమేత భావనారాయణ స్వామి కళ్యాణ క్రతువును వేద పండితులు శాస్త్రోక్తంగా చేపట్టారు. కరోనా లాక్ డౌన్ అమల్లో ఉన్న కారణంగా భక్తులను ఎవరిని ఆలయం లోనికి అనుమతించలేదు.
ఇవీ చూడండి..