కడప జిల్లాలోని కేసీ ఆయకట్టుకు సాగునీరు ఇవ్వడంతో కాలువల్లో జలకళ సంతరించుకుంది. జిల్లాలో కేసీ కాలువ ఆయకట్టు కింద 92 వేల ఎకరాలు ఉండగా ఇటీవలే సాగునీరు విడుదల చేయగా...కాలవలో ఉరకలెత్తే నీటి ప్రవాహాలు అందర్ని కనువిందు చేస్తున్నాయి. ఎగువ తూములకు నీరు అందేలా చేయటంతో కాలువలపై అక్కడక్కడ ఉన్న ఆనకట్టల వద్ద నీటి పరవళ్ళు నయాగరాను తలపిస్తున్నాయి. నీటి హొయల అందాలు ప్రత్యేక ఆకర్షణగమారాయి. పరవళ్లు తొక్కుతున్న నీటి దృశ్యాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
ఇదీ చూడండి:కర్నూలులో వినాయక శోభాయాత్ర