ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తూ ఆటోల ర్యాలీ - ఎన్ఆర్సీకి వ్యతిరేకిస్తూ ఆటోల ర్యాలీ
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కడప జిల్లా రాయచోటిలో ముస్లిం మైనార్టీలకు మద్దతుగా ఆటో యూనియన్ నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కుల మతాల మధ్య విభేదాలు సృష్టించేలా వివాదాస్పద చట్టాలను తీసుకురావడం అప్రజాస్వామికమని జేఏసీ నాయకులు ముత్తి రిజ్వాన్ పేర్కొన్నారు. 28 రోజులనుంచి రిలే నిరాహార దీక్ష చేపడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవటం దారుణమన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఎన్ఆర్సీ, సీఏఏ చట్టాలను రద్దు చేయాలని కోరారు.
ఎన్ఆర్సీకి వ్యతిరేకిస్తూ ఆటోల ర్యాలీ