కడప జిల్లా ఓబులవారిపల్లి మండలం గాదెలలో సారా తయారీ స్థావరాలపై.. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 2300 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసిన పోలీసులు.. 8మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మండలంలో ఎవరైనా సారా తయారీ, విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఇదీచదవండి: ఎస్ఈసీగా రమేశ్ కమార్ కొనసాగింపుపై గవర్నర్కు కన్నా లేఖ