ETV Bharat / state

కడప నడిబొడ్డున వైకాపా నాయకుల దౌర్జన్యకాండ - ap taza

కడప నడిబొడ్డున వైకాపా నాయకుల దౌర్జన్యకాండ సాగింది. స్థలం విషయంలో తలెత్తిన వివాదంలో వైకాపా మూకలు రెచ్చిపోయారు. ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషా సమక్షంలో వైకాపా కార్యకర్తలు, అనుచరులు...తెదేపా నాయకుడు జమీల్ పై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. సర్దిచెప్పాల్సిన పోలీసులు వైకాపా నాయకుల పక్షాన మాట్లాడటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఈ దాడిని తెదేపా నేతలు తీవ్రంగా ఖండించారు.

కడప నడిబొడ్డున వైకాపా నాయకుల దౌర్జన్యకాండ

author img

By

Published : Nov 12, 2022, 8:01 AM IST

కడప వినాయక్‌నగర్‌లో నాలుగు సెంట్ల స్థలం వివాదంలో వైకాపా నాయకులు రెచ్చిపోయారు. తెలుగుదేశం పార్టీ మైనారిటీ నాయకుడు జమీల్ బాషాపై రాళ్లు, కర్రలు, రాడ్లతో దాడి చేశారు. ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషా దగ్గరుండి దాడి చేయించారు. తెదేపా నాయకుడు జమీల్‌కు వినాయక్ నగర్‌లో 4సెంట్ల స్థలం ఉంది. దాన్ని సర్వే చేయించడానికి సిబ్బంది వచ్చారు. ఈ స్థలం వెనకే ఉప ముఖ్యమంత్రి సోదరుడు అహ్మద్ బాషాకు సంబంధించిన 2 ఎకరాల స్థలం ఉన్నట్లు తెలుస్తోంది. జమీల్ స్థలంపై కన్నేసిన వైకాపా నాయకులు అతడితో గొడవకు దిగినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో మాటామాటా పెరిగి తెదేపా నాయకుడిపై వైకాపా నాయకులు మూకుమ్మడి దాడి చేశారు. ఈ దాడిలో జమీల్ బాషా సహా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా..వారిని కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

ఈ దాడిపై జమీల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రిమ్స్‌లో చికిత్స పొందుతున్న జమీల్‌ను తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి, ఇతర నాయకులు పరామర్శించారు. వైకాపా నాయకుల దాడిని ఖండించారు.కడపలో వైకాపా దౌర్జన్యాలు మితిమీరాయని, భూకబ్జాలు ఎక్కువయ్యాయని మండిపడ్డారు.

ఇవి చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.