కడప జిల్లా రెవెన్యూ అధికారి (డిఆర్ఓ)గా ఎ. మాలోల శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. స్థానిక కలెక్టరేట్లోని తన ఛాంబర్లో పురోహితుల ఆశీర్వచనాలు స్వీకరించిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. కడప ఆర్డీవోగా పని చేసిన తనకు జిల్లాలో అన్ని శాఖల సిబ్బంది సుపరిచితమేనని, పదోన్నతిపై తిరిగి ఇదే జిల్లాకు డిఆర్వోగా బాధ్యతలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు మాలోల. జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ సలహాలు, సూచనలు, ఆదేశాలను పాటిస్తూ జేసిల సహకారం మేరకు.. శాఖా పరంగా జిల్లా అభివృద్ధికి మరింత కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలనాధికారి గంగయ్య, అన్ని సెక్షన్ల సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, ఇతర సిబ్బంది పాల్గొని నూతన డిఆర్వో మాలోలకు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలియజేశారు.
ఇవీ చదవండి: వేడుకలకు హాజరయ్యే వారు విధిగా మాస్క్ ధరించాలి: నగర కమిషనర్