ఎక్సైజ్ అధికారులు తనను అవమానించారని ఓ ఆశావర్కర్ ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన కడప జిల్లా రాజంపేట మండలం రోళ్లమడుగులో జరిగింది. గ్రామానికి చెందిన సునీత ఆశావర్కర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఎక్సైజ్ అధికారులు ఇంటికి వచ్చి.. తన భర్త గురించి అడిగారని సునీత తెలిపింది.. అతను ఎక్కడికి వెళ్లాడో తెలియదని బాధితురాలు వారికి సమాధానం తెలపగా..వారు అవమానించేలా దూషించారని ఆవేదన వ్యక్తం చేసింది.. తాను ఆశా వర్కర్‌గా పని చేసుకుంటూ గౌరవంగా జీవిస్తుంటే.. నోటికి వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు మాట్లాడారని ఆమె వాపోయింది. తమకు న్యాయం చేయాలని బాధితురాలు విజ్ఞప్తి చేసింది.
ఇదీ చూడండి. 'రన్ వే తగ్గిస్తే ప్రజల జీవితాలతో ఆడుకున్నట్లే'