ETV Bharat / state

కడప కలెక్టరేట్​ వద్ద ఉద్రిక్తత.. రైతులపై జమ్మలమడుగు ఎమ్యెల్యే అనుచరుల దాడి - Argument between MLA followers and farmers

Attack at Kadapa Collectorate : వైఎస్సార్​ కడప జిల్లా కలెక్టరేట్​ వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. జమ్మలమడుగు ఎమ్మెల్యే అనుచరులు, రైతులు పరస్పరం దాడి దిగారు. కలెక్టరేట్​ దగ్గరే ఘటన జరగటంతో పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని శాంతింపజేశారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Dec 29, 2022, 3:50 PM IST

Attack at Kadapa Collectorate : కడప జిల్లా పెద్దముడియం మండలంలో రాజోలి జలాశయం భూసేకరణ పరిహారం విషయంలో ప్రశ్నించిన రైతులపై జమ్మలమడుగు ఎమ్మెల్యే అనుచరులు దాడికి దిగారు. రాజోలి జలాశయం నిర్మాణానికి సంబంధించి భూసేకరణ అంశంపై చర్చించటానికి.. జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పాటు, ఆయన అనుచరులు, రైతులు కలెక్టర్‌ను కలిసేందుకు కడప జిల్లా కలెక్టరేట్‌కు వచ్చారు. కలెక్టర్​ను కలిసి బయటకు వచ్చిన తర్వాత పరిహారం విషయంలో తమకు సరైన న్యాయం జరగలేదని రైతులు వాపోయారు.

ఇదే విషయమై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వర్గీయులు, రైతులకు మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. ఎమ్మెల్యే కేకలు వేయడంతో ఆయన అనుచరులు రైతులపై దాడి చేశారు. ఈ క్రమంలో పరస్పరం బాహాబాహీకి దిగడంతో కలెక్టరేట్‌ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కలెక్టర్ ఛాంబర్ ఎదుటే ఘటన జరగడంతో పోలీసులు కలగజేసుకుని అందర్ని బయటికి పంపించేశారు.

రాజోలి జలాశయం భూసేకరణ పరిహార విషయమై ఎమ్మెల్యే అనుచరులకు రైతులకు మధ్య వివాదం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.