ETV Bharat / state

మానవత్వం చాటుతున్న ఏఆర్​ పోలీసులు

author img

By

Published : Nov 25, 2020, 1:14 PM IST

పోలీసు ఉద్యోగులు కటువుగా ఉంటారని అనుకుంటారంతా..కానీ కడప ఏఆర్​ పోలీసులు దాతృత్వం చాటుతూ వారికీ మనసుందని తెలియజేస్తున్నారు. సహోద్యోగి మరణిస్తే..తోచినంత ఆర్థిక సాయం చేసి మానవత్వం చాటుతున్నారు.

financial support to the constable family who was died
మృతుడి కుటుంబానికి ఆర్ధికసాయం అందిస్తున్న కానిస్టేబుల్స్​

తోటి కానిస్టేబుల్​ మరణిస్తే సహోద్యోగులందరూ ముందుకు వచ్చి వారికి తోచినంత సాయం చేసి మానవత్వం చాటుతున్నారు. కడపకు చెందిన ఏపీఎస్పీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సహోద్యోగుల కుటుంబాలను కష్టాల్లో ఆదుకోవాలని నిర్ణయించుకున్నారు. 1998వ బ్యాచ్​లో ఎంపికైన కానిస్టేబుల్స్​ అందరూ ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని సహాయం అందిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్​గా పనిచేస్తున్న లూకయ్య ఈనెల 14వ తేదీ అనారోగ్యంతో మరణించాడు. సుమారు 15 మంది కానిస్టేబుళ్లు​ తమకు తోచినంత డబ్బులు పోగు చేసి లక్షా 25 వేల రూపాయల నగదును మృతుడి కుటుంబానికి అందజేశారు.

ఇదీ చదవండి: గొలుసు చోరీ నిందితుడు అరెస్ట్.. ఆభరణం స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.