ముఖ్యమంత్రి సహాయనిధి నకిలీ చెక్కుల కేసును సీబీఐతో విచారణ జరిపించాలని తెదేపా కడప పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జి లింగారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ప్రొద్దుటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన... ఈ కేసులో నిష్ఫక్షపాతంగా విచారణ జరిపించాలన్నారు. సీఎంఆర్ఎఫ్ పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన పథకమన్న లింగారెడ్డి... మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిందితులపై ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలన్నారు.
మరోవైపు హైదరాబాద్లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి కుమారుడిపై నమోదైన కిడ్నాప్ కేసులో తెదేపాకు సంబంధం లేదని స్పష్టం చేశారు లింగారెడ్డి. తెలుగుదేశం పార్టీతో వరదరాజులరెడ్డికి కూడా ఎలాంటి సంబంధం లేదని.... ఈ విషయాన్ని ఆయనే పలు ఇంటర్వూల్లో చెప్పారన్నారు.
ఇదీ చదవండి: