నేటి నుంచి రెండురోజుల పాటు సొంత జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం లింగాల మండలంలోని పార్నపల్లి వద్ద సీబీఆర్ రిజర్వాయర్ వద్దకు చేరుకుంటారు. జలాశయం వద్ద పలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం బోటింగ్ జట్టీ ప్రారంభించనున్న జగన్ ఆపై జల విహారం చేయనున్నారు. అనంతరం వైఎస్సార్ లేక్ వ్యూ పాయింట్‌కు చేరుకుని 4 కోట్ల రూపాయలతో నిర్మించిన రెస్టారెంట్‌ను, వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం లింగాల మండలానికి చెందిన వైకాపా ముఖ్య నాయకులతో సీఎం సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం హెలికాప్టర్ లో బయలుదేరి ఇడుపులపాయ చేరుకొని, రాత్రికి ఎస్టేట్‌లో బస చేయనున్నారు. శనివారం ఉదయం పులివెందులకు వెళ్లి తన వ్యక్తిగత సహాయకుడు డి.రవిశేఖర్ కుమార్తె వివాహ వేడుకలకు హాజరై వధూవరులను ఆశీర్వదిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
నేటి నుంచి సొంత జిల్లాలో సీఎం రెండు రోజుల పర్యటన - ఏపీ తాజా వార్తలు
ముఖ్యమంత్రి జగన్ నేటి నుంచి రెండు రోజుల పాటు కడపలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో వ్యక్తిగత కార్యక్రమాలతో పాటు పలు ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సీఎం రాకతో జిల్లా వ్యాప్తంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు.