రోడ్డు ప్రమాదాల నివారణలో ఆర్టీసీ ఎనలేని కృషి చేస్తుందని కడప జిల్లా ఉప రవాణా శాఖ అధికారి బసిరెడ్డి అన్నారు. కడప డిపోలో కొత్తగా ఏర్పాటు చేసిన ఇంద్ర ఏసీ బస్సు సర్వీసును ఆయన ప్రారంభించారు. ఈ బస్సు ప్రతిరోజు రాత్రి కడప నుంచి బెంగళూరుకు బయలుదేరుతుంది. అత్యాధునికమైన వసతులతో బస్సు ను రూపొందించారు. విశాలమైన సీట్లు, సీసీ కెమెరాలు, అగ్ని నిరోధక పరికరాలను అమర్చారు. బెంగళూరుకు వెళ్లే బస్సులకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభించడంతో మరిన్ని బస్సులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వేసవి దృష్ట్యా ఏసీ బస్సులకు మంచి ఆదరణ ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని అత్యాధునిక బస్సు సర్వీసులను ప్రారంభిస్తామన్నారు.
ఇవీ చదవండి