ఇదీ చదవండి: 'రాజధాని తరలిస్తే... రాయలసీమకు అన్యాయం జరుగుతుంది'
ప్రత్యేక హోదా ఏమయ్యింది...?
రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కడప జిల్లా రాయచోటిలో నిరసన ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పలు రాజకీయ పార్టీ నేతలు పాల్గొన్నారు.
రాయచోటిలో అమరావతి కోసం ర్యాలీ
రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కడప జిల్లా రాయచోటిలో తెదేపా ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాస్ అధ్యక్షతన నేతాజీ కూడలి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకూ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్నికల మేనిఫెస్టోలో మూడు రాజధానులను ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగోలేదన్నప్పుడు, 3 రాజధానుల నిర్మాణం ఎలా సాధ్యమని నిలదీశారు. ప్రత్యేక హోదా హామీ ఏమయ్యిందని ఎద్దేవా చేశారు. అన్ని ప్రాంతాల వారికీ సమాన దూరంలో ఉన్న అమరావతినే రాజధానిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: 'రాజధాని తరలిస్తే... రాయలసీమకు అన్యాయం జరుగుతుంది'
Intro:స్క్రిప్ట్ రాష్ట్ర రాజధాని అమరావతి రాను కొనసాగించాలని కడప జిల్లా రాయచోటి లో పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోమవారం నిరసన ర్యాలీ ధర్నా కార్యక్రమం కొనసాగింది తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సీపీఐ ప్రజా సంఘాలు కాంగ్రెస్ పార్టీ జనసేన లో స్థానిక నేతాజీ కూడలి వద్ద నిరసన చేపట్టారు అక్కడ నుంచి అమరావతి ముద్దు విశాఖ వద్దు అంటూ నినాదాలు చేస్తూ బస్టాండ్ రోడ్డు మీదుగా రెవెన్యూ కార్యాలయానికి చేరుకున్నారు తాసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి నేతలు ప్రసంగించారు రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులు మాటను తెరపైకి తేవడం మంత్రులు నేతల స్వలాభం కోసమే అన్నారు రాజధాని కోసం విలువైన ఆస్తులు త్యాగం చేసి 30 వేల ఎకరాల భూమిని ఇచ్చిన రైతుల త్యాగాలను మరచి వారిపై విచక్షణారహితంగా పోలీసులతో దాడి చేస్తున్నారని విమర్శించారు ప్రభుత్వం తన వైఖరి మార్చుకుని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉన్న అమరావతి రాజధానిగా కొనసాగించాలని లేనిపక్షంలో రాయలసీమలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వివిధ పార్టీల నేతలు ముక్తకంఠంతో పేర్కొన్నారు ఎన్నికల సమయంలో ఏనాడు మూడు రాజన్న మాట చెప్పకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇష్టానుసారం రాజధాని మారుస్తా ఉంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు అన్నారు అనంతరం తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో తెదేపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గాజుల ఖాదర్ భాషా న్యాయవాదులు సిపిఐ నాయకుడు సునాద ఎమ్మార్పీఎస్ నాయకుడు రామాంజనేయులు శ్రీనివాసులు ప్రసంగించారు
Body:బైట్స్ 1.రామాంజనేయులు ఎమ్మార్పీఎస్ నాయకులు
2.ఎం విశ్వనాథ సిపిఐ నాయకుడు
3. శ్రీనివాసులు సిఐటియు నాయకులు
4. శ్రీనివాసరెడ్డి తేదేపా జిల్లా అధ్యక్షుడు
Conclusion:అమరావతిలోని రాజధాని కొనసాగించాలని పరిరక్షణ సమితి నిరసన
Body:బైట్స్ 1.రామాంజనేయులు ఎమ్మార్పీఎస్ నాయకులు
2.ఎం విశ్వనాథ సిపిఐ నాయకుడు
3. శ్రీనివాసులు సిఐటియు నాయకులు
4. శ్రీనివాసరెడ్డి తేదేపా జిల్లా అధ్యక్షుడు
Conclusion:అమరావతిలోని రాజధాని కొనసాగించాలని పరిరక్షణ సమితి నిరసన