All Party Leaders Meeting : కడపలో తెలుగుదేశం ఆధ్వర్యంలో సమావేశమైన అఖిలపక్షం నేతలు.. అప్పర్ భద్ర ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాటానికి చేపట్టాల్సిన కార్యాచరణ, రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి ఎలా తీసుకురావలనే అంశాలపై చర్చించారు. వైఎస్సార్సీపీ, బీజేపీ మినహా అన్ని రాజకీయపార్టీలు, ప్రజాసంఘాల నాయకులు హాజరయ్యారు. అప్పర్ భద్ర ప్రాజెక్టు వల్ల రాయలసీమతోపాటు.. సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలోని ప్రాజెక్టులకూ నీరు రాని పరిస్థితి ఏర్పడుతుందని నాయకులు హెచ్చరించారు. కర్ణాటక ప్రభుత్వం, కేంద్రంపై పోరాటానికి అఖిలపక్షం ఏర్పాటు చేయాలని.. సుప్రీంకోర్టులోనూ న్యాయపోరాటం చేయాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు.
"కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రయోజనాలకోసం.. రాయలసీమలోని కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల రైతులు, రైతు కూలీలు, పేద ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోనే పరిస్థితి వచ్చింది. కర్ణాటక దోపిడి చేయాటానికి కేంద్ర ప్రభుత్వం లైసెన్స్ ఇవ్వటమే కాకుండా.. నిధులు కూడా ఇచ్చింది. అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించటం, కేంద్ర జల సంఘం అనుమతులు ఇవ్వటం చాలా బాధకరం."-లింగారెడ్డి, టీడీపీ నేత
"ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సొంత రాజకీయ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా.. తనకు రాజకీయ భవిష్యత్‌కు జన్మనిచ్చిన రాయలసీమ ప్రాంతాన్ని తాకట్టు పెట్టిన పరిస్థితి ఉంది. దీనివల్ల రాయలసీమలోని ప్రధానమైన ప్రాజెక్టులన్నీ వట్టికుండలుగా మారబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. వెంటనే అఖిల పక్ష సమావేశం నిర్వహించాలి. రాష్ట్ర నిరసనను కేంద్రానికి తెలియజేయాలి. ఇలా చేయకపోతే రాష్ట్ర ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోతాడు."-రవిశంకర్‌రెడ్డి, రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షుడు
ఇవీ చదవండి :