ETV Bharat / state

'స్థానిక ఎన్నికల ప్రక్రియను మళ్లీ ప్రారంభించాలి' - ఏపీలో స్థానిక సంస్థల తీరుపై అఖిలపక్షం నిరసనలు

స్థానిక సంస్థల ఎన్నికల తీరును నిరసిస్తూ ఈనెల 18న కడప కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు సీపీఐ కడప జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య తెలిపారు.

ఈశ్వరయ్య, సీపీఐ కడప జిల్లా కార్యదర్శి
ఈశ్వరయ్య, సీపీఐ కడప జిల్లా కార్యదర్శి
author img

By

Published : Mar 16, 2020, 6:47 PM IST

'ఎన్నికల తీరుకు నిరసనగా ఆందోళనలు చేపడతాం'

రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ప్రక్రియను మళ్లీ మెుదటి నుంచి చేపట్టాలని కడపలో అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. ఎన్నికల్లో వైకాపా దౌర్జన్యాలకు పాల్పడినట్లు స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు వైకాపాకు కార్యకర్తలుగా మారి నామినేషన్ వేయకుండా ఇతర పార్టీల అభ్యర్థులను అడ్డుకున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లను చించివేయటం సరికాదని సీపీఐ కడప జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య మండిపడ్డారు. ఎన్నికల తీరును నిరసిస్తూ ఈ నెల 18న కడప కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నామన్నారు.

ఇవీ చదవండి:

ముఖ్యమంత్రిగా జగన్ అనర్హుడు: తులసి రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.