ETV Bharat / state

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమ శాఖ సిబ్బంది ధర్నా

కడప పీఎఫ్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమ శాఖ సిబ్బంది నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సిబ్బందికి సంబంధించిన పీఎఫ్ డబ్బుల వివరాలను తెలియజేయాలని వారు డిమాండ్​ చేశారు. పొరుగు సేవల సిబ్బంది జీతం నుంచి సంబంధిత ఏజెన్సీ వారు పీఎఫ్ డబ్బులు తీసుకుంటున్నారు కానీ జమ చేయడం లేదని ఆరోపించారు.

aituc protest at pf office for proundent fund
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమ శాఖ సిబ్బంది ధర్నా
author img

By

Published : Jun 29, 2020, 3:40 PM IST

సాంఘిక సంక్షేమ శాఖ విభాగంలో సేవలందిస్తున్న సిబ్బందికి సంబంధించిన పీఎఫ్ డబ్బుల వివరాలను తెలియజేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్ డిమాండ్ చేశారు. పొరుగు సేవల సిబ్బంది పీఎఫ్ డబ్బులు జమ చేయకుండా గత ఐదేళ్ల నుంచి ఇబ్బంది పెడుతున్నా సంబంధిత ఏజెన్సీపై చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కడప పీఎఫ్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తక్షణం పొరుగు సేవల సిబ్బందికి సంబంధించిన పీఎఫ్ డబ్బులు ఎంత ఉన్నాయి, అనే వివరాలు తెలియజేయాలని కోరారు. లేదంటే జిల్లా వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

ఇవీ చూడండి... ప్రజలంతా అధికారులకు సహకరించాలి: అంజాద్ బాషా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.