ETV Bharat / state

'సీఎంకు సమీక్షలే తప్పా.. కార్మికుల కష్టాలు పట్టవ్'

దేశంలోని చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు.. భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటున్నాయి. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి అవేం పట్టించుకోవడం లేదని కడప ఏఐటీయూసీ జిల్లా నాయకులు నాగ సుబ్బారెడ్డి ఆరోపించారు. సీఎంకు సమీక్షలే తప్పా కార్మికుల కష్టాలు పట్టవా అని మండిపడ్డారు.

AITUC Dharna for building workers to giving fund by cm jagan in kadapa district

author img

By

Published : May 31, 2020, 9:13 PM IST

సీఎం జగన్ ప్రభుత్వం ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తోందని కడప ఏఐటీయూసీ జిల్లా నాయకులు నాగ సుబ్బారెడ్డి ఆరోపించారు. కరోనా నేపథ్యంలో చాలా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు భవన నిర్మాణ కార్మికులకు.. వారి ఖాతాలో నగదు జమ చేసిందని అన్నారు. కానీ ఇప్పటివరకు మన రాష్ట్రంలోని కార్మికుల ఖాతాల్లో ఎలాంటి నగదు జమ చేయలేదన్నారు.

అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కార్మికుల పట్ల స్పందించారు.. కానీ ఒక్క సీఎం జగన్ మాత్రం.. రోజూ సమీక్షలు జరపడమే తప్ప..కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు నాగ సుబ్బారెడ్డి. ఇప్పటికైనా ప్రభుత్వం కార్మికుల ఖాతాల్లోకి నగదు జమ చేయాలి.. లేదంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

ఆకట్టుకుంటున్న సీఎం జగన్ సైకత శిల్పం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.