కరోనా ఉద్ధృతి సమయంలో అదానీ గ్రూప్ భారీ విరాళం అందించింది. కడప జిల్లాలోని కరోనా బాధితుల కోసం అదానీ గ్రూప్ అందించిన రూ.కోటి విలువ చేసే 253 ఆక్సిజన్ సిలిండర్లను ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా, ఎంపీ అవినాష్ రెడ్డి జిల్లా యంత్రాంగానికి అందజేశారు. మరో రూ.27 లక్షల విలువైన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అదానీ గ్రూప్ ఇవ్వనున్నట్లు ఎంపీ తెలిపారు. జిల్లా అవసరాల కోసం తక్షణం స్పందించిన అదానీ గ్రూప్ యాజమాన్యానికి ప్రజల తరపున ఎంపీ అవినాష్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
భారతీ సిమెంట్ ఉదారత..
జిల్లాలో కరోనాతో బాధపడుతున్న బాధితుల కోసం భారతి సిమెంట్ యాజమాన్యం రూ.22 లక్షల విలువ చేసే 22 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను కలెక్టర్ హరికిరణ్కు అందజేశారు. గతంలోనూ రూ.60 లక్షలతో 20 కిలోల ఆక్సిజన్ నిల్వ ఉండే ట్యాంకు ఏర్పాటు చేశారని కలెక్టరు కొనియాడారు.
ఇదీ చదవండి