కడప జిల్లా రాయచోటి ప్రధాన రహదారి టోల్గేట్ వద్ద పనిచేస్తున్న మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారన్న కారణంతో... అదే మండలానికి చెందిన దామోదర్ యాదవ్పై పోలీసులు చేయి చేసుకున్నారు. ఏఎస్ఐ లాఠీతో కొట్టడంతో దెబ్బలు తాళలేక ఠాణా ఎదుట ఉన్న జాతీయ రహదారిపైకి పరుగులు తీశాడు. తనను కొట్టవద్దని బతిమాలుతూ కన్నీటి పర్యంతమయ్యాడు.
బహిరంగ ప్రదేశంలో జరుగుతున్న ఈ ఘటనను చూసేందుకు జనం ఎగబడ్డారు. కొందరు ఆ దృశ్యాలను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. మరో వైపు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతోనే స్టేషన్కు పిలిపించామని, అప్పటికే దామోదర్ మద్యం సేవించాడని పోలీసుల తెలిపారు.
ఇదీచదవండి.