ETV Bharat / state

వాగేటికోన జలాశయం పనుల్లో ప్రమాదం.. లారీ డ్రైవర్​ మృతి - vagetikona reservoir latest news

బిల్లు బాటుపల్లి గ్రామంలోని వాగేటి కోన జలాశయం మరమ్మతు పనుల్లో లారీతో మట్టిని డంపు చేస్తున్న సమయంలో విద్యుదాఘాతం జరిగింది. లారీ డ్రైవర్​ వాసు (30) మృతి చెందాడు. మృతుడు నెల్లూరు జిల్లా వాసిగా పోలీసులు గుర్తించారు.

a person died in vagetikona reservoir repair works in cuddapah district
మృతి చెందిన లారీ డ్రైవర్​ వాసు
author img

By

Published : Jun 10, 2020, 8:11 AM IST

వాగేటి కోన జలాశయం మరమ్మతు పనుల్లో విద్యుదాఘాతం జరిగి లారీ డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన కడప జిల్లా రైల్వే కోడూరు మండలం బిల్లు బాటుప్లలిలో జరిగింది. మృతి చెందిన వ్యక్తి.. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన వాసు(30)గా పోలీసులు గుర్తించారు. జలాశయం మరమ్మతు పనుల్లో... రోడ్డు పక్కన లారీతో మట్టిని డంపు చేస్తుండగా విద్యుత్​ తీగలు లారీ ట్రాలీకి తాకాయి.

వెంటనే లారీ టైర్ల నుంచి మంటలు వచ్చాయి. లారీలో నుంచి దిగే క్రమంలో విద్యుదాఘాతం జరిగి వాసు అక్కడికక్కడే మృతి చెందాడని స్థానిక సీఐ ఆనందరావు తెలిపారు. క్లీనర్​ మాత్రం తప్పించుకున్నడని ఆయన తెలియజేశారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

ఇదీ చదవండి:

విధి నిర్వహణలో విద్యుదాఘాతం.. లైన్​మన్​ మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.