కడప జిల్లా రైల్వే కోడూరు మండల పరిధిలోని జ్యోతి కాలనీ సమీపంలో చెట్టును ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ మృతిచెందాడు. చెన్నై నుంచి కడపకు వెళ్తున్న లారీ అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో లారీ వూర్తిగా ధ్వంసం కాగా.. అందులో చిక్కుకున్న డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు.
మృతుడిని మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన ధ్యానేశ్వర్ విటల్గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వేకోడూరు ఎస్సై పెద్ద ఓబన్న పేర్కొన్నారు.
ఇదీ చూడండి: