ETV Bharat / state

రైల్వే కోడూరులో ఘనంగా గౌరమ్మ ఉత్సవాలు

author img

By

Published : Jan 17, 2021, 8:59 AM IST

రైల్వే కోడూరు నియోజకవర్గంలో గౌరమ్మ ఉత్సవాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఈ ఏడాది శుక్రవారం కనుమ రావటంతో శనివారం గౌరమ్మను ఏటికి సాగనంపారు. మహిళలు కోలాటాలు, చెక్క భజనలు, ఆటపాటలతో సందడి చేశారు.

A grand procession of Gauramma festivel at Railway Koduru
రైల్వే కోడూరులో ఘనంగా గౌరమ్మ ఉత్సవాల ఊరేగింపు

కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో గౌరమ్మ ఉత్సవాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. రైల్వే కోడూరు నియోజకవర్గం పరిధిలోని రైల్వే కోడూరు, ఓబులవారిపల్లె, పుల్లంపేట, పెనగలూరు, చిట్వేలి మండలాల్లో గౌరమ్మ, గొబ్బెమ్మ ఉత్సవాలు పల్లె పల్లెలో వైభవంగా జరిపారు.

కొన్ని గ్రామాల్లో మహిళలు కోలాటాలతో సందడి చేస్తుంటే.. మరి కొన్ని గ్రామాల్లో చెక్క భజనలు, ఆటపాటలతో డీజే వాయిద్యాలతో గౌరమ్మ ఊరేగింపులు కన్నులపండువగా సాగాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఏటా గౌరమ్మ ఊరేగింపు కనుమ పండుగ రోజున జరుపుతారు. అయితే ఈ ఏడాది శుక్రవారం కనుమ రావటంతో శనివారం గౌరమ్మను ఏటికి సాగనంపారు. నియోజకవర్గ పరిధిలోని గ్రామాలన్నీ గౌరమ్మ, గొబ్బెమ్మ ఉత్సవాలతో ప్రత్యేక కళను సంతరించుకున్నాయి.

ఇవీ చూడండి:

జిల్లాలో 20 కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.