సాధారణంగా తొపుడు బండ్ల పై వ్యాపారం చేసే వ్యాపారులు పలకలపై ధరలు రాసి పెడతారు.. కానీ కడప జిల్లా ప్రొద్దుటూరులో మాత్రం రసూల్ అనే పండ్ల వ్యాపారి బిన్నంగా ఆలోచించారు. తూకం తక్కువ ఉంటే మెట్టుతో కొట్టండి అంటూ అని రాసి బండికి తగిలించారు.
అతని నిజాయితీని ప్రజలు ప్రసంశిస్తున్నారు. కరోనా నేపథ్యంలో మాస్కులు ధరించండి.. కరోనాను తరమండి అంటూ మరో పలకపై రాసి తోపుడు బండికి కట్టాడు. వ్యాపారం చేస్తూనే మరోవైపు ఇలా అవగాహన కల్పిస్తున్నారు. పండ్లు కొనుగోలు చేసేందుకు వచ్చినవారంతా అతన్ని అభినందిస్తున్నారు.
ఇదీ చూడండి: