ETV Bharat / state

నీటి బకెట్​లో పడి బాలుడు మృతి - child died news

ముద్దుముద్దుగా అల్లరి చేస్తుండే బాలుడు మృత్యుఒడికి చేరాడన్న నిజం ఆ కుటుంబ సభ్యుల హృదయాలను తొలిచేస్తోంది. గత నెల.. చిన్నారి మొదటి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంతలోనే నూరేళ్లు నిండాయి.

baby boy
మృతి చెందిన బాలుడు
author img

By

Published : Apr 18, 2021, 1:24 PM IST

కడప జిల్లా మైదుకూరులో పదమూడు నెలల బాలుడు మృతి చెందాడు. షేక్‌ నూర్‌బాషా దంపతులకు రెండో కుమారుడు షేక్‌ అహ్మద్‌ పక్కనే ఉన్న అవ్వ ఇంట్లో ఆడుకుంటూ.. స్నానాల గదిలోకి వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటి బకెట్​ పడ్డాడు. ఇంట్లోని వారు బాలుడిని గుర్తించేటప్పటికే మరణించాడు. ఈ ఘటనతో బాలుడి కుటుంబంలో విషాదం అలుముకుంది. గతనెలలోనే ఆ బాలుడి మొదటి జన్మదిన వేడుకలను జరిపించారు. అరచేతిలో అల్లారు ముద్దుగా పెరిగిన చిన్నారి అనంతలోకాలను చేరటంతో.. తల్లిదండ్రుల రోదించే తీరు అందరినీ కంటతడి పెట్టించింది.

ఇదీ చదవండి: విశాఖలో వైద్య విద్యార్థి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.