ETV Bharat / state

విద్యుదాఘాతంతో ఒంటె మృతి.. జీవనాధారం కోల్పోయిన కుటుంబం - a camel died in kadapa

కడప జిల్లా రాజంపేటలోని ఉస్మాన్ నగర్​లో వీధుల్లో తీరుగుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ తీగలు తగలడంతో ఓ ఒంటె మృతిచెందింది. అప్పటివరకు దాన్ని ఆనందగా చూసిన స్థానికులు.. ఒంటె మరణంతో ఒక్కసారిగా ఆందోళన చెందారు. దానిపైనే ఆధారపడి జీవిస్తున్న ఆ కుటుంబానికి పెద్ద దెబ్బ తగిలింది.

a camel died due to electrical shock
విద్యుదాఘాతంతో ఒంటె మృతి
author img

By

Published : Jan 31, 2021, 6:29 PM IST

కడప జిల్లా రాజంపేటలో విద్యుదాఘాతానికి గురై ఓ ఒంటె చనిపోయింది. నెల్లూరు జిల్లా మంచాలపల్లి గ్రామానికి చెందిన ఓ కుటుంబం... రాజంపేట ప్రాంతంలో ఒంటె సాయంతో ఇంటింటికి తిరుగుతూ స్థానికులు ఇచ్చే డబ్బుతో జీవనం సాగిస్తున్నారు. ఇవాళ.. రాజంపేటలోని ఉస్మాన్‌ నగర్‌లో ఇంటింటికీ తిరుగుతున్న సమయంలో విద్యుత్‌ తీగలు తగలడం వల్ల ఆ ఒంటె ఒక్కసారిగా కుప్పకూలింది. కొద్దిసేపు విలవిల్లాడిన ప్రాణాలు విడిచింది. దాన్నే ఆధారంగా చేసుకొని జీవనం సాగిస్తున్న ఆ కుటుంబం దిగ్భ్రాంతికి గురైంది. స్థానికులు.. సుమారు రూ. 30 వేలు వసూలు చేసి బాధిత కుటుంబానికి అందజేశారు.

ఇదీ చూడండి: కడప జిల్లాలో ఆర్టీసీ ఎండీ ఠాగూర్ పర్యటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.