..
నీటి ఊబిలో చిక్కుకుని బాలుడు మృతి - నీటి ఊబిలో చిక్కుకుని బాలుడు మృతి
ఈత కోసం వెళ్లి.. నీటి ఊబిలో చిక్కుకుని ఓ బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన కడప జిల్లా పోరుమామిళ్లలో జరిగింది. గ్రామానికి చెందిన జమాల్ బాషా స్నేహితులతో కలిసి ఈత కోసం వెళ్లాడు. అక్కడ నీటి ఊబిలో చిక్కుకుని బయటికి రాలేక ప్రాణాలను వదిలాడు. బాషా తల్లి ఉపాధి నిమిత్తం గల్ఫ్‌లో ఉండగా...మృతుడు అవ్వ, తాతల సంరక్షణలో పెరుగుతున్నాడు. బాలుడు మృతితో అవ్వ, తాతలు కన్నీరుమున్నీరవుతున్నారు.
జమాల్ బాషా మృతదేహం వద్ద ఏడుస్తున్న బాలుడి తాత
..