కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలోని ఉప్పరపల్లి హరిజనవాడకు చెందిన హర్షిత్(5) విద్యుదాఘాతంతో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ...తల్లి శైలజ ఇంటి బయట కూర్చుని హర్షిత్‌కు అన్నం తినిపించింది. తరువాత బాలుడు మరుగుదొడ్డికి వెళ్లాడు. ఇంతలోనే ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగకు హర్షిత్ తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతి చెందాడు. కొడుకు విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి ఆ తల్లి గుండెలు అవిసేలా రోదించింది.
ఇదీ చూడండి