ETV Bharat / state

YS Viveka: వివేకా మాజీ డ్రైవర్​ దస్తగిరి దంపతులను విచారించిన సీబీఐ - వివేకానంద రెడ్డి హత్య తాజా వార్తలు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వరుసగా 50వ రోజూ సీబీఐ విచారణ కొనసాగుతోంది. కొత్తగా వచ్చిన సీబీఐ ఉన్నతాధికారి రామ్‌కుమార్ ఆధ్వర్యంలో.. గంటన్నరకుపైగా వివేకా ఇంటితోపాటు, పరిసరాలను అధికారులు పరిశీలించారు. కుటుంబసభ్యులతో మాట్లాడారు. పులివెందుల ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో.. వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి, అతడి భార్యను ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో సునీల్‌ కుమార్‌ యాదవ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది.

50th of day CBI inquiry on viveka murder
వివేక ఇంటిని పరిశీలించిన అధికారులు
author img

By

Published : Jul 26, 2021, 2:22 PM IST

Updated : Jul 26, 2021, 4:51 PM IST

ముఖ్యమంత్రి జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో.. వరుసగా 50వ రోజూ సీబీఐ విచారణ కొనసాగుతోంది. కొత్తగా వచ్చిన సీబీఐ ఉన్నతాధికారి రామ్‌కుమార్ ఆధ్వర్యంలో అధికారులు.. గంటన్నరకుపైగా వివేకా ఇంటితోపాటు, పరిసరాలు గమనించారు. కడప నుంచి పులివెందుల వెళ్లిన సీబీఐ అధికారుల బృందం..పలు విషయాలపై ఆరా తీస్తోంది.

వివేకా ఇంట్లో ఉన్న ఆయన భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డితో వారు మాట్లాడారు. హత్య జరిగిన రోజు జరిగిన పరిణామాలపై ఆరా తీశారు. ఈ కేసుకు సంబంధించి.. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు వివరాలు, వారి దృష్టికి వచ్చిన విషయాలపై చర్చించారు.

వివేకా ఇంట్లో పరిశీలనల అనంతరం.. సీబీఐ అధికారుల బృందం పులివెందుల పట్టణంలో ఆర్ అండ్ బీ అతిథి గృహానికి వెళ్లింది. అక్కడ వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి, అతడి భార్యను అధికారులు ప్రశ్నిస్తున్నారు. వాచ్‌మెన్ రంగన్న వాంగ్మూలం తర్వాత.. అనుమానితులను విచారించారు. ఆ తర్వాత కొంతసేపటికి పులివెందుల కోర్టుకు సీబీఐ అధికారులు వెళ్లారు.

ఇదీ చూడండి:

FLOOD: గోదావరి నదికి పోటెత్తిన వరద.. నీటిలోనే లోతట్టు ప్రాంతాలు

Last Updated : Jul 26, 2021, 4:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.