ETV Bharat / state

కరోనా సోకితే.. 104కు కాల్​ చేయండి.. ఫేక్ కాల్స్ చేయోద్దు! - కడప 104 కాల్ సెంటర్​కు ఫోన్ కాల్స్ న్యూస్

కొవిడ్ బాధితులు 104 కాల్ సెంటర్​కు ఫోన్ చేసిన 3 గంటల్లోనే ఆసుపత్రుల్లో పడకలు ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వం ప్రకటనతో.. కాల్స్‌ తాకిడి ఎక్కువైంది. కడప కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్‌కు రోజూ వందల సంఖ్యలు ఫిర్యాదులు వస్తున్నాయి. అదే సమయంలో.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఫేక్ కాల్స్ బెడద వెంటాడుతోంది.

కరోనా సోకితే.. 104కు కాల్​ చేయండి.. ఫేక్ కాల్స్ కాదు!

author img

By

Published : May 7, 2021, 4:39 AM IST

Updated : May 7, 2021, 5:50 AM IST

వారం రోజుల నుంచి కడప జిల్లాలో రోజుకు వెయ్యికి పైగానే పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. రోజుకు 4 వేలకు పైగానే ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 4 ప్రభుత్వ కొవిడ్ ఆసుపత్రులు, 20 ప్రైవేటు కొవిడ్ ఆసుపత్రుల్లో పడకలు పూర్తిగా నిండిపోయాయి. ఈ సమయంలో చాలామంది పాజిటివ్ లక్షణాలతో బాధపడుతున్న వారు ఎక్కడికి వెళ్లాలో తెలియక 104 కాల్ సెంటర్​ను ఆశ్రయిస్తున్నారు. కరోనా పరీక్షల వివరాల కోసం రోజుకు 3వందలకు పైగానే ఫిర్యాదులు వస్తున్నాయి. పడకల కోసం రోజుకు 50 నుంచి 70 మంది ఫోన్లు చేస్తున్నారు. వీరందరికీ 104 కాల్ సెంటర్ అధికారులు సమాధానాలు ఇస్తూ.. కావాల్సిన సౌకర్యాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.

ఏప్రిల్ మొదటి నుంచి ఇప్పటివరకు కడప కాల్‌సెంటర్‌కు 3వేల 367 ఫోన్ కాల్స్ వచ్చాయంటున్నఅధికారులు దాదాపు అన్నీ పరిష్కరించినట్లు చెబుతున్నారు. కానీ కొందరు అనవసరంగా 104 కాల్ సెంటర్ కు ఫోన్లు చేస్తున్నట్లు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫేక్ కాల్స్ వల్ల తమ పని కష్టం అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాల్ సెంటర్ కు ఫోన్ చేసిన వారు తిరిగి తాము కాల్ చేస్తే సరైన సమాధానం చెప్పకుండా.. దాటవేస్తున్నారని అధికారులు వాపోతున్నారు.

కరోనా బాధితుల సమస్యలు తెలుసుకొని.. అవసరమైతే బాధితుల ఇంటికి అంబులెన్సు పంపిస్తున్నామంటున్న అధికారులు.. ఆపదలో ఉన్నవారికి సాయపడాల్సిన వేళ ఫేక్‌ కాల్స్‌ చేసి ఇబ్బంది పెట్టడం మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో కరోనా రోగులకు 50 శాతం బెడ్లు: సీఎం జగన్

Last Updated : May 7, 2021, 5:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.