ETV Bharat / state

సీఎం జగన్ కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ... కారణం ఇదే..! - ఎంపీ రఘురామకృష్ణరాజు వార్తలు

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు... సీఎం జగన్ కు లేఖ రాశారు. కరోనా లాక్ డౌన్ వల్ల 20 లక్షల మంది భవన, నిర్మాణ కార్మికులు పనుల్లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారిని ఆదుకునేందుకు ఒక్కొక్కరికి రూ. 5 వేలు ఆర్థిక సాయం చేయాలని సీఎంను కోరారు.

సీఎం జగన్ కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ... కారణం ఇదే..!

author img

By

Published : Jul 14, 2020, 3:04 PM IST

భవన నిర్మాణ కార్మికులకు ఒక్కొక్కరికి రూ.5 వేలు ఆర్థిక సాయం చేయాలని ముఖ్యమంత్రి జగన్ ను నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కోరారు. లాక్ డౌన్ కాలంలో ఆ వర్గాల కార్మికులు పడుతున్న ఇబ్బందులను వివరిస్తూ సీఎం జగన్ కు ఆయన లేఖ రాశారు. లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలో 20 లక్షల మంది నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. జీవనోపాధి లేక తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తమను ఆదుకోవాలని చాలా మంది కార్మికులు విన్నవించుకున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం భవన, నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం బిల్డర్ల నుంచి సెస్ వసూలు చేస్తోందని గుర్తు చేసిన ఎంపీ... 2014 సెప్టెంబర్ 27 నుంచి 2019 అక్టోబర్ వరకు రూ.1340.65 కోట్లు వసూలు చేశారని లేఖలో వివరించారు.

ఆధార్ అనుసంధానం సత్వరమే పూర్తి చేయండి

కార్మికుల సంక్షేమం కోసం కేవలం రూ.308.22 కోట్లు మాత్రమే ప్రభుత్వం ఖర్చు చేసిందని .. ప్రభుత్వం వద్ద ఇంకా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా నిధులు ఉన్నాయని ఎంపీ అన్నారు. శాసనమండలిలో సభ్యుల ప్రశ్నలకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానాన్ని.. తన వ్యాఖ్యలకు ఆధారంగా లేఖకు జతచేశారు. ఈ నిధుల నుంచి కార్మికుల సంక్షేమం కోసం ఆర్థిక సాయం చేయాలని సీఎం జగన్ ను రఘురామకృష్ణరాజు కోరారు.

భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో 20 లక్షల 64 వేల 379 మంది నమోదు చేసుకోగా.. వీరిని ఆధార్ తో అనుసంధానించే ప్రక్రియ ప్రభుత్వం ప్రారంభించిందని.. జులై 8 వరకు 10 లక్షల 66 వేల 265 మంది కార్మికులు మాత్రమే అనుసంధానం చేశారని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా మిగిలిన వారికి ప్రక్రియ పూర్తి చేసి సత్వరమే సాయం అందేలా చూడాలని సీఎంను లేఖలో విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

ఎస్​ఐ వేధింపుల తాళలేక యువకుని బలవన్మరణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.