డ్వాక్రా మహిళల రుణమాఫీకి ప్రభుత్వం ప్రకటించిన వైఎస్సార్ ఆసరా పథకాన్ని పశ్చిమ గోదావరి జిల్లా అధికారులు ప్రారంభించారు. అర్హులందరికీ ఈ పథకంతో లబ్ధి చేకూరేలా సామాజిక తనిఖీ కార్యక్రమాలు చేపట్టారు. ఇందుకోసం అర్హులైన వారి జాబితాను సంబంధిత సచివాలయాల్లో అందుబాటులో ఉంచారు. 2019 సంవత్సరం ఏప్రిల్ 11 నాటికి డ్వాక్రా మహిళా సంఘాలు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
ఇందులో భాగంగా అర్హత పొందిన సంఘాలు, అర్హులైన సభ్యులను అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. పశ్చిమగోదావరి జిల్లాలో 63,401 సంఘాలలోని 6 లక్షల 30 వేల 417 మంది సభ్యులను ఎంపిక చేశారు.
ప్రకటించిన జాబితాలో అర్హుల పేర్లు లేకపోతే ఈ నెల 28లోగా సంబంధిత ఏపీఎంలను సంప్రదించాలని జిల్లా అధికారులు పేర్కొన్నారు. ఈనెల 30వ తేదీన తుది జాబితాను ప్రకటించనున్నట్లు వివరించారు. ఆ జాబితా ప్రకారం వచ్చే నెల 11వ తేదీన రుణమాఫీ మొత్తాలను సంఘాల బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని అధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి:
కడప జిల్లాలో ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్... ఉత్తర్వులు జారీ