వైఎస్ జగన్ పాదయాత్ర చేపట్టి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాదయాత్ర చేశారు. వేల్పూర్ రోడ్డులోని భాష్యం పాఠశాల నుంచి ప్రారంభమైన పాదయాత్ర రాజీవ్ చౌక్ సెంటర్ నరేంద్ర మున్సిపల్ కార్యాలయం మీదుగా ఉండ్రాజవరం జంక్షన్ వరకు కొనసాగింది. జగన్ పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన సంక్షేమ కార్యక్రమలు గురించి వివరిస్తూ పాదయాత్ర కొనసాగనుందని ఎమ్మెల్యే వెల్లడించారు.
ఇదీ చదవండి: