పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన రావాడ మంగిరెడ్డి (25) అనే యువకుడు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మంగిరెడ్డికి జన్మనిచ్చిన తల్లి.. అతనికి 3 నెలల వయసున్నప్పుడే మరణించింది. తనను మూడేళ్ల క్రితం దత్తత తీసుకున్న మేనత్త కూడా మరణించింది.
మంగి రెడ్డి చిన్నాన్న గోవిందరెడ్డి వద్ద ఉంటూ, పాత ఇనుము కొనే వ్యాపారం చూసుకుంటున్నాడు. ఈనెల 10న మాతృ దినోత్సవం కావడం ఇద్దరి అమ్మలను గుర్తు చేసుకొని తీవ్రంగా మనస్థాపానికి గురయ్యాడు. దుకాణంలోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఇవీ చూడండి: