పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కరాటం కృష్ణమూర్తి ఎర్ర కాలువలో స్నానానికి దిగి.. ఓ యువకుడు మృతిచెందాడు. గొల్లపల్లి అవినాష్... తన స్నేహితుడి వివాహ దినోత్సవం పురస్కరించుకొని జలాశయం వద్ద నిర్వహించిన పార్టీలో పాల్గొన్నాడు. పార్టీ అనంతరం స్నానం చేద్దామని కాల్వలోకి దిగి.. వెంటనే మునిగిపోయాడు.
పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు. శవపరీక్ష కోసం జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. జరిగిన ప్రమాదంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు లక్కవరం పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: